రేపు నగరంలో బ్లాక్ డే – మరోవైపు ఉప్పల్ లో క్రికెట్ మ్యాచ్ – ఏమవుతుందో మరి…?

Thursday, December 5th, 2019, 08:23:47 PM IST

డిసెంబర్ 6 (శుక్రవారం నాడు) హైదరాబాద్ నగరంలో బ్లాక్ డే. కానీ అదే రోజు మరొక అద్భుతమైన అంశం చోటు చేసుకోనుంది. కాగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. కానీ గతంలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైన డిసెంబరు 6న నగరంలో బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. కాగా ఈమేరకు ఉప్పల్ లో జరగబోయే మ్యాచ్ కి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు… ఈమేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… హైదరాబాద్ క్రికెట్ సంఘంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి అజహరుద్దీన్ ఆధ్వర్యంలో, అతని కార్యవర్గం చేపడుతున్న మొదటి మ్యాచ్ ఇదే అవడం వలన పూర్తీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

అయితే ఈ భారత్, వెస్టిండీస్ మధ్యన జరగనున్న మ్యాచ్ కోసం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని, ఎవరైనా చట్ట విరుద్ధమైన పనులు చేస్తే, తప్పకుండ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. కాగా ఉప్పల్ మ్యాచ్ కోసం 1800 మంది పోలీసులను భద్రత నిర్వహించనున్నట్లు సమాచారం. ఇకపోతే బ్యాగులు, లైటర్లు, సిగరెట్లు, ల్యాప్ టాప్ లు, ఆహార వస్తువులు, నాణేలు, పెన్నులు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, హెల్మెట్లు స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.