బిగ్ న్యూస్: విశాఖ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్

Thursday, February 27th, 2020, 11:51:46 AM IST


తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖపట్టణం చేరుకోనున్నారు. అయితే చంద్రబాబు కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండగా, వైసీపీ కార్యకర్తలు సైతం వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం గమనార్హం. చంద్రబాబు గోబ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. టీడీపీ-వైసీపీ నేతల మధ్యన వాగ్వాదం జరుగుతుండటం తో పోలీసులు ఇరు వర్గాల్ని శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు ని వెనక్కి తిప్పి పంపే ఉద్దేశ్యం తో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. అభివృద్ధి ని పలు కార్యక్రమాలని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఫై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇరు వర్గాల నినాదాలతో విశాఖపట్టణం ఎయిర్పోర్ట్ రణరంగాన్ని తలపిస్తుంది.