రైతన్నను ఆదుకుంటే తప్పేంటి?

Monday, October 20th, 2014, 04:25:08 PM IST

telangana-high-court
రుణమాఫీపై స్టే విధించాలంటూ లోక్ సేవ సంస్థ దాఖలు చేసిన పిటీషన్ పై సోమవారం హైదరాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పేంటి అంటూ కోర్టు పిటీషనర్ ను సూటిగా ప్రశ్నించింది. అలాగే దుస్తులు ఇచ్చే నేతన్నలు, ఇళ్ళు కట్టే తాపీ మేస్త్రీలకు సహకరిస్తే తప్పేమిటని కోర్టు నిలదీసింది. ఇక ప్రభుత్వ నిర్ణయం సరైనదా? లేదా? అన్న విషయం తాము చర్చించడం లేదని, సామాజిక ఆలోచన దృక్కోణం ఎందుకు మారటం లేదని కోర్టు ప్రశ్నించింది. అలాగే సరైన వివరాలతో మరోమారు పిటీషన్ వెయ్యాలని కోర్టు ఆదేశించింది.

ఇక తెలంగాణలో ఇటీవల జరిపిన సమగ్ర సర్వేలో ప్రైవేట్ వ్యక్తుల చేత వివరాలు నమోదు చేయించారని వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కాగా దీనిపై విచారించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అలాగే నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.