జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చిన హైకోర్ట్.. వివరణ ఇవ్వాల్సిందే..!

Tuesday, December 3rd, 2019, 08:59:39 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీ అయిన మధ్యపాన నిషేదాన్ని అమలు చేసేందుకు జగన్ సర్కార్ అంచెలంచెలుగా అందుకు కృషి చేస్తూ వస్తుంది. అయితే ఇందు కోసం ఏపీలో కొత్త మద్యం పాలసీనీ కూడా తీసుకొచ్చారు.

అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్తం మద్యం పాలసీపై హైకోర్ట్ స్టే విధించింది. అంతేకాదు ఈ నెల 23 వరకు కొత్త మద్యం పాలసీనీ అమలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన కొత్త మద్యం పాలసీని రూపొందించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం రిటైల్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానిది అని మరి బార్లకు ఏ విధంగా ధరల నిర్ణయం జరిగిందో చెప్పాలని కోరింది. అంతేకాదు ఈ నెల 9లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.