ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి షాక్.. హైకోర్ట్ నోటీసులు..!

Friday, December 13th, 2019, 04:15:24 PM IST

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీకి హైకోర్ట్ మరోసారి షాక్ ఇచ్చింది. 2012లో నిజామాబాద్ సభలో హిందువులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్‌ను సవాల్ చేస్తూ హిందూ సంఘటన్ అధ్యక్షుడు, న్యాయవాది కరుణసాగర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి మరియు సీబీసీఐడీ పోలీసులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తీరు మారలేదని, పదేపదే వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కరుణసాగర్ పిటీషన్‌లో పేర్కొన్నారు. గతంలో హిందూ దేవతలపై కూడా అక్బరుద్దీన్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆ కేసులో కూడా ఇటీవలే నిర్మల్ కోర్ట్‌లో హాజరయ్యారు.