బ్రేకింగ్: తెలంగాణ స్పీకర్‌కు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్ట్..!

Tuesday, June 11th, 2019, 04:31:52 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ సీఎల్పీనీ వీలీనం చేయడాన్ని నిరసిస్తూ ధర్నాలు, పిటీషన్లు దాఖలు చేసారు కాంగ్రెస్ నేతలు భట్టి మరియు ఉత్తం కుమార్ రెడ్డి. అయితే నేడు ఈ పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలతో సహా, తెలంగాణ స్పీకర్‌కు, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుముర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్, వనమా వెంకటేశ్వరరావు, సబిత, సురేందర్‌కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిపేందుకు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

సీఎల్పీ విలీన ప్రక్రియను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించడం సరికాదని స్పీకర్‌గా ఒక పార్టీనీ వేరొక పార్టీలోకి విలీనం చేసే హక్కు ఉండదని అయినా ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్ ఈ పని చేసారని ఈ నెల 6న అసెంబ్లీ సెక్రెటరీ జారీచేసిన బులెటిన్‌-10ని రద్దుచేయాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైకోర్ట్‌ను ఆశ్రయించి వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.