జగన్ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్.. అసలేం జరుగుతుంది..!

Monday, January 13th, 2020, 06:10:29 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని గ్రామాలలో నెలకొన్న పరిస్థితులపై జగన్ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది.

అయితే ప్రస్తుతం రాజధాని గ్రామలలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున దానిని తొలగించాలని హైకోర్ట్‌లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే మహిళలపై దాడి చేసిన పోలీసుల తీరుపై కూడా కోర్ట్ వివరణ కోరింది. గ్రామాలలో పోలీసులు భారీ సంఖ్యలో మార్చ్ ఫాస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుతో రాజధానిలో ఖర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందని, శాంతియుత నిరసనలను ఎందుకు అడ్డుకుంటున్నారని కోర్ట్ ప్రశ్నించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ దీనిపై పూర్తి వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.