ఆ పరిస్థితి రానీయకండి.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్ట్..!

Wednesday, May 27th, 2020, 12:52:40 AM IST

కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హైకోర్ట్ తీవ్రంగా మండిపడింది. అయితే రాష్ట్రంలో వైద్యులకు మాస్క్‌లు ఇవ్వటం లేదని, కరోనా పరీక్షలు సరిగ్గా చేయడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరకుంటున్న వలస కార్మికులకు వసతి కల్పించడం లేదంటూ ఇటీవల హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

అయితే ఐసీఎంఆర్ నిబంధనలు అన్ని రాష్ట్రాలు పాటిస్తుంటే తెలంగాణలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జూన్ మొదటి వారంలోపు ఎంత మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్ర దేశంలోనే లక్ష మంది వైరస్‌ సోకి మృత్యువాత పడ్డారని దయచేసి అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో తీసుకురావద్దని ప్రభుత్వానికి సూచిస్తుంది.