ఆ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు సూటి ప్రశ్న..!

Tuesday, September 22nd, 2020, 02:59:56 PM IST

ఏపీలోని చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్ మృతి కేసులో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్ట్ మరోసారి మండిపడింది. నేడు దీనిపై విచారించిన హైకోర్ట్ ఈ కేస్‌ను సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నించింది. అయితే ఈ కేసు విచారన పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని కావున ఈ కేసు కొట్టివేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

అయితే తమ ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పరచగలరంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కిరణ్ కుమార్‌తో పాటు ఉన్న సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డ్ ఇస్తామని బాధితుడి తరపున న్యాయవాది శ్రవణ్ తెలుపగా, అది అవసరం లేదని హైకోర్ట్ తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐతో ఎంక్యూరీ చేయించే అర్హత కలిగి ఉందని కోర్ట్ స్పష్టం చేసింది. అయితే ఈ కేసుపై ప్రభుత్వం తరుపున పూర్తి వివరాలు అందించేందుకు రెండు వారాలు సమయం కోరడంతో ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.