కొడుకు స‌మ‌క్షంలో స్టార్ సింగ‌ర్ రెండో పెళ్లి

Saturday, May 12th, 2018, 03:27:08 PM IST

బాలీవుడ్ గాయ‌కుడు హిమేష్ రేష‌మ్మియా రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ శ‌నివారం రాత్రి కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో సైలెంట్‌గా త‌న గాళ్‌ఫ్రెండ‌క్ష సోనీని ఆయ‌న పెళ్లాడేశారు. వాస్త‌వానికి హిమేష్ త‌న తొలి భార్య‌కు విడాకులు ఇవ్వ‌డానికి ఈ భామ‌తో ఎఫైర్ కార‌ణ‌మ‌ని బాలీవుడ్ లో ప్ర‌చార‌మైంది. హిమేష్ త‌న తొలి భార్య‌తో దాదాపు 22 సంవ‌త్స‌రాలు అనుబంధం సాగించారు. ఆ క్ర‌మంలోనే ఆ జంట‌కు ఓ బిడ్డ కూడా జ‌న్మించాడు. పేరు స్వ‌యం. హిమేష్ రెండో పెళ్లిలో ఆ బాలుడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు.

తాజాగా హిమేష్ – సోని జంట ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి రిలీజైంది. ఈ ఫోటోలో పూర్తిగా పంజాబీ స్టైల్లో హిమేష్ డ్రెస్సింగ్ ఆక‌ట్టుకుంది. పెళ్లికూతురు ప్ర‌త్యేక‌మైన లెహంగా డ్రెస్‌ .. భారీ ఆభ‌ర‌ణాల‌తో నిండుగా క‌నిపిస్తోంది. హిమేష్ వివాహానికి ఇత‌ర‌త్రా సెల‌బ్రిటీలు ఎవ‌రు అటెండ‌య్యారు? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments