బాలకృష్ణకు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

Wednesday, February 24th, 2021, 05:04:28 PM IST

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. హిందూపురం నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 38 స్థానాల్లో 30 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అయితే ఇది మరిచిపోకముందే టీడీపీకి హిందూపురంలో మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రంగనాయకులు టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు.

అయితే వైసీపీ ఎమ్మెల్సీ, హిందూపురం ఇంఛార్జ్ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ సమక్షంలో రంగనాయకులు వైసీపీలో చేరిపోయారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో రెండోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత కొంత కాలంగా రంగనాయకులు టీడీపీకి దూరంగా

ఉంటున్నారు. ఈ క్రమంలో రంగనాయకులు వైసీపీలో చేరడం టీడీపీ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.