హిరణ్య కశ్యపుడు ఆగలేదంటున్న దర్శకుడు ?

Sunday, October 15th, 2017, 12:45:41 PM IST

దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తరువాత రెండు సినిమాలు చేస్తాడని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి హిరణ్య కశ్యప. రుద్రమదేవి విడుదలై కూడా రెండేళ్లు దాటిపోయినా కూడా మరో సినిమా చేయలేదు. ఇక రెండు సినిమాల్లో ఒకటి హిరణ్య కశ్యప, మైతిలాజికల్ సినిమాగా తెరెక్కే ఈ చిత్రం భారీ బడ్జెట్ కారణంతో ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ స్పందించాడు. హిరణ్య కశ్యప తప్పకుండా సెట్స్ పైకి వస్తుందని అంటున్నాడు. భారీ సెట్టింగులతో భిన్నమైన సినిమాలు తీసే దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గుణశేఖర్ .. మరో వైపు ప్రతాప రుద్రడు సినిమాకూడా చేస్తానని అంటున్నాడు. ఇక హిరణ్య కశ్యప సినిమాలో రానా నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడట. పైగా ఈ సినిమాకోసం రానా కూడా రిస్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు గుణశేఖర్. సో మొత్తానికి రానా హీరోగా హిరణ్య కశ్యప సెట్స్ పైకి వచ్చే సమయం దగ్గరలోనే ఉంది.