హిట్టా లేక ఫట్టా : ఎమ్యెల్యే – కమర్షియల్ ఎంటెర్టైనెర్

Friday, March 23rd, 2018, 04:04:22 PM IST

ఎన్నో అంచనాలతో యువ హీరో నందమూరి కల్యాణరామ్ హీరోగా రచయిత ఉపేంద్ర మాధవ్ తొలిసారి మెగా ఫోన్ పట్టిన సినిమా ఎమ్యెల్యే . కాజల్ అగర్వాల్ హీరోయిన్, ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. కథ విషయానికి వస్తే కొన్ని కారణాల వల్ల ఇంటినుండి బయటకు వచ్చేసిన ఇందు (కాజల్ ) ఒక కంపెనీ కి ఎండి అవడం. అనుకోకుండా కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) ని కలవడం తరువాత ఇద్దరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే ఇద్దరి ప్రేమపెళ్లి దాకా వెళ్లాలంటే కళ్యాణ్ ఎమ్యెల్యే కావాలని ఇందు ఫామిలీ షరతు పెట్టడంతో, అతడు ఎలాగైనా ఎమ్యెల్యే అయి ఇందు ని ఎలా దక్కించుకుంటాడు అనేదే మొత్తం కథ.

ఇక మొదటగా కళ్యాణ్ పాత్రలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో అలరించారు. ఆయన చెప్పిన మాస్ డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఎమ్యెల్యే స్టైల్ వైట్ అండ్ వై6ట్ డ్రెస్ లో ఆయన బాగున్నారు. ఫస్ట్ హాఫ్ లో మోడరన్, అలానే సెకండ్ హాఫ్ లో పల్లెటూరి అమ్మాయిగా కాజల్ బాగా నటించింది. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంటర్టైన్మెంట్ తో సాగినప్పటికీ ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్ బాగుంది. అయితే సెకండ్ హఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ లో ఏమి జరగబోతుందో చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. అందువల్ల సెకండ్ హాఫ్ అంతగా పండలేదని లేదని చెప్పాలి. పృథ్వి, బ్రహ్మానందం, పోసానిలా కామెడీ పర్వాలేదనిపించాయి. రెండు పాటలు బాగున్నయి. కెమెరా పనితనం, అలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ అలరిస్తాయి.

హీరో ఎమ్యెల్యే అయ్యే క్రమం లో విలన్ ని ఛాలెంజ్ చేయడంవంటి సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసినవే. అయితే విలన్గా రవికిషన్ మంచి నటన కనబరిచారు. సెకండ్ హాఫ్ లో జనానికి మేలు చేయాలనే తలంపుతో హీరో చేసే పనులు బాగుంటాయి. మొత్తంగా వెరసి ఒక పక్కా కమర్షియల్ సినిమాగా ఉపేంద్ర దీనిని తీర్చిదిద్దారు. సెకండ్ హాఫ్ లో అయితే దర్శకుడు చాలా చోట్ల కథ ట్రాక్ తప్పాడు అని తెలిసిపోతుంది. ఏది ఏమైనప్పటికి ఈ సినిమా చూడటానికి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి పూర్తి న్యాయం జరగకపోయినా, ఒక కమర్షియల్ హంగులున్న సినిమా చూశామని ఫీల్ మాత్రం కలుగుతుంది.

 

ఎమ్యెల్యే – రెగ్యులర్ కమర్షియల్ సినిమా

Reviewed By 123telugu.com |Rating : 3/5

రెగ్యులర్ మసాలా సినిమా

Reviewed By greatandhra.com |Rating : : 2.5/5

మాములు లక్షణాలు వున్న అబ్బాయే

Reviewed By tupaki.com |Rating : 2.25/5