హిట్టా లేక ఫట్టా : ‘రాజా ది గ్రేట్’ ట్రెండీ టాక్

Wednesday, October 18th, 2017, 02:15:02 PM IST

రవితేజ కు మాస్ ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వరుస ప్లాపులతో కొద్దిగా గ్యాప్ తీసుకున్న రవితేజ తాజగా రాజా ది గ్రేట్ చిత్రంతో మన ముందుకు వచ్చేశాడు. రవితేజ మాస్ మ్యానరిజమ్స్, ఎంటర్ టైనింగ్ కామెడీని ఇన్నిరోజులు మిస్సైన ఆడియన్స్ ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకుని ఉన్నారు. కమర్షియల్ గా ప్రూవ్ చేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈచిత్రం తెరకెక్కింది. తొలిసారి రవితేజ అంధుడి పాత్రలో నటించనుండడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కాగా ఈచిత్రం లో ఎంటర్ టైన్మెంట్ కు ఏమాత్రం కొదవ ఉండదని అటు చిత్ర యూనిట్ చెబుతుండగా, ట్రైలర్ ని గమనిస్తే కూడా ఆ విషయం అర్థం అవుతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

స్టోరీ పరంగా రొటీనే అనే అభిప్రాయం ప్రేక్షకులనుంచి వ్యక్తం అవుతున్నా ఎంటర్ టైన్మెంట్ కు మాత్రం 100 మార్కులు వేస్తున్నారు. పోలీస్ ఆఫిసర్ అయిన తన తండ్రికి ఉండే శత్రువుల వలన హీరోయిన్ కూడా చిక్కుల్లో పడుతుంది. అంధుడైన రవితేజ ఆమెకు ఎలా నీడగా మారాడు అనేదే ఈ చిత్ర కథ. ఎప్పటిలాగే ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ తో మాస్ రాజా ఆకట్టుకున్నాడు. కామెడీని బ్యాలెన్స్ చేస్తూనే అవసరమైన చోట్ల రవితేజ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కాగా ఈ చిత్రానికి ఉన్న ప్రధాన మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్ లో కథని సాగదీయడమే. ఏది ఏమైనా రాజా ది గ్రేట్ చిత్రం మంచి కమర్షియల్ వాల్యూస్ తో కాసులు కురిపించే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రానికి వివిధ ప్రముఖ వెబ్ సైట్లు ఇచ్చిన రేటింగులు, సోషల్ మీడియా లో అభిమానుల స్పందన ఈ విధంగా ఉంది.

 

కథ తక్కువైనా ఎంటర్టైన్మెంట్ బాగుంది

Reviewed By 123telugu.com |Rating : 3.25/5

రాజా.. ది (రొటీన్) ఎంటర్టైనర్!

Reviewed By tupaki.com |Rating : 2.75/5

రాజా.. వెరీ యావరేజ్

Reviewed By gulte |Rating : 2.75/5

రొటీన్ రాజా

Reviewed By greatandhra |Rating : 2.5/5


 

 


  •  
  •  
  •  
  •  

Comments