హిట్టా లేక ఫట్టా : కాశి – పెద్దగా ఆకట్టుకోదు

Friday, May 18th, 2018, 06:05:35 PM IST

నటుడిగా మారిన సంగీత దర్శకుడు విజయ్ అంటొని తెలుగు బిచ్చగాడు తో సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత విడుదలయిన ఆయన చిత్రాలేవీ ఆ స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. కాగా ప్రస్తుతం ఆయన నటించిన కాశి చిత్రం నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సరసన అంజలి హీరోయిన్ గా నటించింది. ఇదివరకు వచ్చిన బిచ్చగాడు తరహాలోనే మదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగె ఈ చిత్రం ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందనను పొందింది. ఇక కథలోకి వెళితే అమెరికాలోని భరత్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ చీఫ్ గా వున్న భరత్ జీవితంలో సకల సౌకర్యాలతో ఎంతో ఆనందంగా జీవిస్తుంటాడు. అయితే అతనికి చిన్ననాటి జ్ఞాపకం ఒకటి కల రూపంలో అతనిని వెంటాడుతూ ఉంటుంది.

ఆ సమయంలో అతనితో పాటువున్న తల్లితండ్రులు అతని సొంత తల్లితండ్రులు కారని తెలుసుకున్న అతడు కన్నవారి కోసం ఇండియా బయలుదేరుతాడు. ఈ పయనంలో అతనికి తన తల్లి తండ్రుల జాడ తెలిసిందా, వారిని వెతికే అతని ప్రయత్నం ఫలించిందా, వారు ఇప్పుడు ఎలా వున్నారు అనేదే అసలు కథ. ముఖ్యంగా హీరోగా చేసిన విజయ్ ఆంటోనీ భరత్ క్యారెక్టర్ లో ఇమిడిపోయి చిత్రాన్ని ఒంటిచేత్తో నడిపించాడని చెప్పాలి. ఇక దర్శకురాలు కిరుతిగా ఉదయనిధి చిత్రం ప్రారంభంలో తల్లి తండ్రుల వెతుకులాటకు బయలుదేరడం అనే అంశాన్ని మంచి ఆసక్తికరంగా చూపారు. అతని పయనంలో ముందుగా తల్లిని కనుక్కోవడం, అలానే తన తల్లి, తండ్రినుండి విడిపోవడం జరిగిందని తెలుస్తుంది. తండ్రి ఆమెను ఎందుకు విడిచి వెళ్ళాడు, అతని తండ్రి ఎవరు అని తెలిపే అంశాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రానికి ప్రధాన బలం.

ఇక దర్శకురాలు తల్లితండ్రులను వెతుక్కుంటూ వెళ్లే కొడుకు వారిని ఎలా చేరుకున్నాడు అని ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానిని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మంచి పాయింట్ తో ప్రారంభమైన సినిమా తరువాత కథని వేరే దారి మళ్లించి అసలు కథాంశం పై ప్రేక్షకుడుకి ఆశక్తిని కోల్పోయేలా చేసారు. నిజానికి తాను రాసుకున్న కథలో హీరో గురించి తన తల్లితండ్రుల గురించి చెప్పకుండా ఏ మాత్రం సంబంధము లేని ఇద్దరు వ్యక్తుల కథలు చెప్పడం కోసం చిత్రంలో దాదాపు గంట సమయాన్ని వృధా చేశారనిపిస్తుంది. అసలు కథ ఎటుపోతోంది, హీరోకి సంబంధం లేని ఆ వ్యక్తుల జీవితాలు కథలోకి ఎందుకు వచ్చాయో తెలియక ప్రేక్షకుడు తల పట్టుకోవలసి వస్తుంది. పాటలు కూడా వినసొంపుగా లేక బోర్ కొట్టిస్తాయి. ఇక హీరోయిన్ అంజలి పాత్ర అయితే ఏమాత్రం ఆకట్టుకోదనే చెప్పాలి.

దర్శకురాలు హీరోకి అతని తల్లికి మధ్య వున్న మదర్ సెంటిమెంట్ని సరిగా ఎలివేట్ చేయకపోగా కథ పూర్తిగా పక్కదారి పట్టడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. పాటలు ఆకట్టుకోనప్పటికీ విజయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుందనిపిస్తుంది. ఇక రిచర్డ్ ఎం నాథన్ ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటర్ లారెన్స్ కిశోర్ ఆ గంట పక్కదారి పెట్టె కథలో కొంతభాగం అయినా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బిచ్చగాడు మాదిరి విజయ్ ఆంటోనీ ఈ సారినమ్ముకున్న మదర్ సెంటిమెంట్ బాగున్నప్పటికీ దర్శకురాలు కథలో దాదాపు గంటసేపు కథను పక్కదారి పట్టించడం, ఏమాత్రం ఆకుట్టేనే అంశాలు చిత్రంలో లేకపోవడం వెరసి ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు అని చెప్పవచ్చు……

అనవసరమైన కథే ఎక్కువగా వుంది

Reviewed By 123telugu.com |Rating :2.5/5

కిక్ ఇవ్వలేకపోయిన కాశి

Reviewed By andhraheadlines |Rating :1.25/5

ఈ ‘కాశి’ తో చాలా కష్టం

Reviewed By gulte.com |Rating :1/5

బోర్ కొట్టే కథ

Reviewed By chitramala.in |Rating : 2.5/5


 


  •  
  •  
  •  
  •  

Comments