హిట్టా లేక ఫట్టా : కణం

Friday, April 27th, 2018, 05:16:38 PM IST

నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వం రూపొందిన చిత్రం కణం. ప్రసిద్ధ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం మంచి థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 సంవత్సరాల వయసులో ప్రేమించుకున్న కృష్ణ, తులసీలు ఆ వయసులో తొందరపడతారు. ఫలితంగా తులసి గర్భవతి అవుతుంది. అయితే తరువాత తులసి గర్భవతి అని తెలుసుకున్న ఆమె తల్లితండ్రులు జరిగిన విషయాన్నీ తులసి చెప్పడంతో కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి తులసికి అబార్షన్ చేయిస్తారు. అయితే అబార్షన్ అయినా 5 సంవత్సరాల తర్వాత పిండ దశలోనే చనిపోయిన బిడ్డ ఆత్మ రూపంలో వచ్చి తులసి కుటుంబ సభ్యుల పై కక్ష తీర్చుకోవాలి అనుకుంటుంది.

అయితే ఆ ఆత్మ ఏవిధంగా ఏ విధంగా ఎవరెవరిపై పగ తీర్చుకుంది అనేదే కథాంశం. అయితే ముఖ్యంగా చెప్పుకోవడానికి అబార్షన్ సమయంలో చనిపోయిన పిండం తల్లిని చూడాలనే ఆశతో ఆత్మగా మారి రావడం. ఒకవేళ నిజంగా బిడ్డ పుట్టి ఉంటే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో, బిడ్డపుడితే దియా అనే పేరుపెట్టాలని తల్లి నిర్ణయించడం వంటి ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా దర్శకుడు యుక్త వయసులో తప్పులు చేసి దానిఫలితంగా అబార్షన్లతో కడుపులోనే బిడ్డలను ఎలా అంతమొందిస్తున్నారుఅనే విషయాలను తెలపటం బాగుంది. సినిమాలో కొన్ని ఊహించని రీతిలో వుండే సన్నివేశాలు, ఊహించని క్లైమాక్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇకపోతే సినిమా కథ బాగున్నా చూపించడానికి తగినంత కధనం విజయ్ తయారుచేసుకోవడంలో కొంత విఫలమయ్యాడు.

ముఖ్యమా ప్రేక్షకులు కోరుకునే కామెడీ, గ్లామర్, ఎంటర్టైన్మెంట్ తదితర అంశాలు లేకపోవడం ఒకరకంగా పెద్ద దెబ్బె అని చెప్పాలి. పైగా కామెడీ కోసి మధ్యలో వచ్చే ప్రియదర్శన్ సన్నివేశం కావాలని కథలో ఇరికించినట్లు ఉండడం, పెద్దగా పండకపోవడం ఒక మైనస్ గా చెప్పుకోవాలి. హీరో పాత్ర కూడా అంత బలంగా అనిపించలేదు. అలానే తల్లీబిడ్డల మధ్య మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా వెరసి కణం సినిమా అంత గొప్ప సినిమా కాకపోయినా తీసేసే సినిమా అయితే కాదు అని చెప్పుకోవాలి. దర్శకుడు ఏ ఎల్ విజయ్ మంచి ఎమోషనల్ కథని సందేశాత్మక పాయింట్ తో చెప్పడం బాగుంది. రొటీన్ ఫస్ట్ హాఫ్, ఊహాజనితమైన సీన్ లు కావలసిన ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల ఈ కణం చిత్రం మొత్తంగా చూస్తే ఒక యావరేజ్ చిత్రం అని చెప్పవచ్చు……

ఎమోషనల్ రివెంజ్ డ్రామా

Reviewed By 123telugu.com |Rating :3/5

థ్రిల్ చేయడంలో కణం ఫెయిల్ అయింది

Reviewed By andhraheadlines.com |Rating : 2/5

పర్వాలేదనిపించిన కణం మూవీ

Reviewed By chitramala.com |Rating :2.5/5

ఇదిఒక ప్రాణం లేని కణం

Reviewed By cinejosh.com |Rating :2/5


 


  •  
  •  
  •  
  •  

Comments