షాకింగ్ వీడియో : ఇల్లు లేక రోడ్డున పడ్డ జాకీచాన్ కూతురు

Tuesday, May 1st, 2018, 03:52:29 PM IST

మాస్టర్ లార్డ్స్, కుంఫు, కరాటేలో మాస్టర్ ఎవరు అంటే టక్కున చప్పగలిగే పేరు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్. కానీ జాకీ చాన్ కూతురు ఎట్టా ఇంగ్ రోడ్డున పడింది. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జిల కింద తలదాచుకుంటూ అవస్థలు పడుతున్నది. ఇంగ్, ఆమె గర్ల్‌ఫ్రెండ్ ఆండీ ఆటమ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తమ దయనీయ పరిస్థితిని చెప్పుకుంటూ బాత్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కులను వ్యతిరేకించే తమ తల్లిదండ్రులే తమ దుస్థితికి ముఖ్య కారణమని ఆమె ఆ వీడియోలో ఆరోపించింది. నెల రోజులుగా ఇలా రోడ్లపైనే ఉంటున్నామని ఆమె చెప్పింది. మాజీ బ్యూటీ క్వీన్ ఇలైన్ ఇంగ్‌తో అప్పట్లో ఎఫైర్ నడిపించిన జాకీచాన్ ఎట్టా ఇంగ్‌కు జన్మనిచ్చాడు.

తన కూతురి గురించి జాకీ చాన్ ఎప్పుడూ పబ్లిగ్గా చెప్పకపోయినా.. ఇలైన్‌తో ఎఫైర్ ఉన్న విషయాన్ని మాత్రం పబ్లిక్ గా అంగీకరించాడు. ఇప్పుడు తాజాగా ఎట్టా పోస్ట్ చేసిన వీడియోపై ఆమె తల్లి ఇలైన్ స్పందించింది. ఆమె దగ్గర డబ్బులు లేకపోతే ఏదైనా పని చూసుకోవాలి. అంతేగానీ ఇలా వీడియో పోస్ట్ చేసి తాము బాధల్లో ఉన్నామని చెబుతూ తన తండ్రి గురించి చెప్పడం సరికాదు అని ఇలైన్ చెప్పింది. అయితే చాన్ తన జీవితంలో ఎప్పుడూ లేడని, అతన్ని తాను ఎప్పుడూ తండ్రిగా చూడనని గతంలో ఇంగ్ చెప్పింది. ఇక వీళ్ళు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీస్కుంటారా అని వేచి చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరైనా తాము తలదాచుకోవడానికి కొంచం సహాయం చేయమని కోరారు. వీళ్ళ ఆవేదనకీ సంబంధించిన వీడియోను మీరూ చూడండి.

Comments