చంద్రబాబు మాపై గెలవలేక విమర్శలు చేస్తున్నారు – మేకతోటి సుచరిత

Wednesday, February 24th, 2021, 07:39:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పోలీసులను ఉపయోగించి ఎన్నికల్లో గెలిచింది అంటూ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు హోమ్ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. పంచాయతి ఎన్నికల ఫలితాలు తమ పని తీరుకు దర్పణం పట్టాయి అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా మా నాయకుడు జగన్ వెంట ఉన్నారు అని మరోమారు స్పష్టం అయింది అంటూ సుచరిత వ్యాఖ్యానించారు. అయితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నూ మరింత విజయం సాధించే దిశగా కృషి చేస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు పై పలు వ్యాఖ్యలు చేశారు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు గెలవలేక మా పై విమర్శలు చేస్తున్నారు అంటూ విమర్శించారు. చంద్రబాబు ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చిన పరిస్తితి లేదు అని వ్యాఖ్యానించారు. అయితే మా సీఎం జగన్ 30 లక్షల మందికి సొంతింటి కల సాకారం చేస్తున్నారు అని తెలిపారు. పట్టణాల్లో ప్రతి ఒక్క పేదవాని కి గూడు దొరికింది అని, ఒక్కొక్క ఇంటికి నాలుగు నుండి ఆరు సంక్షేమ పథకాలు అందాయి అని తెలిపారు. అయితే పోలీసులను ఉపయోగించి గెలిచాం అన్న చంద్రబాబు వ్యాఖ్యలు అర్థ రహితం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లా వ్యవస్థలను వాడుకోవడం మాకు చేతకాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం మరియు వ్యవస్థల పై గౌరవం ఉందని అన్నారు. అయితే స్వయంగా ఎస్ఈసి నే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని కితాబు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.