కేసీఆర్ సర్కార్ పై ఆందోళన చేయాలా..? వద్దా..?

Friday, September 12th, 2014, 05:23:39 PM IST


రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టి చేప‌ట్టిన నిర‌స‌న కార్యక్రమాల‌పైఆ పార్టీలో విభేదాలు పొడ‌చూపాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 100 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంద‌ని దీనిని అప్పుడే ప్రభుత్వ అసమర్ధతని ఎలా అంటామ‌ని కొంత మంది నేత‌లు వాపోతున్నారు.

రాష్ర్టం ఏర్పడి కేవ‌లం 100 రోజులు మాత్రమే పూర్తయింది. అస‌లే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి స‌రైన స‌హ‌కారం అంద‌టం లేదు. ఇవ‌న్ని ఆలోచించుకుండా మ‌న‌మే ముఖ్యమంత్రి కేసిఆర్ పై ప్రత్యక్షంగా ఆందోళన‌లు చేప‌ట్టడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని గాంధీ భ‌వ‌న్ లో నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు అన్ని ప‌ద‌కాల‌పై స‌మావేశాలు మాత్రమే జ‌రిపామ‌ని ఇంకా అస‌లు పని మొద‌లు పెట్టలేదని స్వయానా ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన విష‌యాన్ని గుర్తుంచుకోవాలి క‌దా అని ఓ నాయ‌కుడు అన్నట్టు సమాచారం.

రైతు ర‌ణ‌మాఫీతో పాటు ఇత‌ర ప‌దకాల‌పై ప్రభుత్వం ఇచ్చిన హామిల‌పై ఇంకా కొంత స‌మ‌యం ఇస్తే బాగుండునని… భ‌విష్యత్ లో ఇలాంటి తొంద‌రపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల‌ని అంటున్నారు.మెద‌క్ పార్లమెంటు ఉప ఎన్నిక‌ల్లో ఓట్లు వ‌స్తాయేమోన‌న్న ఆశ‌తోనే రైతు స‌మ‌స్యల‌పై ధర్నాల‌కు పిలుపు నిచ్చార‌న్న ప్రచారం జోరుగా ఉంద‌ని అంటున్నారు. అయితే తెలంగాణ పీసీసీ ఛీఫ్ పోన్నాల మాత్రం అన్ని జిల్లాల్లో క‌లెక్టరేట్ల ముందు పార్టి చేప‌ట్టిన నిర‌స‌న కార్యక్రమాలు య‌ప్రదం చేయాల‌ని పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాలో ఆయన పాల్గోనున్నారు.

ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పుడే ఆందోళ‌ల‌న‌కు పిలుపివ్వడం టి-కాంగ్రెస్ నేత‌ల్లో విబేధాలు పొడ‌చూపుతున్న నేఫ‌థ్యంలో శుక్రవారం హైదరాబాద్ మిన‌హా తెలంగాణలోని అన్ని జిల్లా క‌లెక్టర్ కార్యాల‌య‌ల ముందు పార్టి ఇచ్చిన నిర‌స‌న కార్యక్రమాలు ఎంత వరకు జ‌య‌ప్రదం అవుతాయో చూడాలి.