రక్షణ కల్పించాల్సిన వారికే రక్షణ లేదు..హ్యాకింగ్ కు గురైన హోమ్ శాఖ కంప్యూటర్లు !

Wednesday, December 28th, 2016, 07:31:59 PM IST

hacker
కేంద్ర హోమ్ శాఖ కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురైన విషయం సంచలనం రేపుతోంది. కంప్యూటర్ల డేటా మార్చడం ద్వారా 16 మంది ఎన్జీఓ లు విదేశీ నిధులను పొందడానికి అనుమతులు లభించినట్లు అయింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు వారి అనుమతులను రద్దు చేశారు. దీనితో హోమ్ శాఖ అధికారులు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు.

దీనిని అధికారులు గుర్తించకపోయి ఉంటే ఆయా సంస్థలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ కింద నిధులు పొందడానికి అవకాశం కలిగి ఉండేది. మరోవైపు మరికొందరు అధికారులు మాత్రం ఇది కంప్యూటర్ లలో జరిగిన సాంకేతిక సమస్య వలన మాత్రమే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.కేంద్ర హోమ్ శాఖ విదేశీ నిధులపై సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం దేశం లో 13000 మంది ఎన్జీవో లు విదేశీ నిధులను స్వీకరిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments