హోమ్ మేడ్ పెళ్లి కూతురు చూశారంటే ఔట్‌ !

Thursday, January 18th, 2018, 03:47:12 PM IST

పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి? భార‌తీయ‌త నిండిన వ‌ధువు ఎలా ఉంటుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ప్ర‌త్యేకించి చెప్పాల్సిన సంద‌ర్భం వ‌స్తే ఇదిగో ఇలా బెబోలా ఉండాల‌ని చెబితే చాలు. ఇక్క‌డ క‌నిపిస్తున్న న‌వ‌వ‌ధువు ఎవ‌రు? అంటే సందేహం రేకెత్తిస్తున్న ఈ అందం ఓ బిడ్డ‌కు త‌ల్లి అంటే న‌మ్మ‌గ‌ల‌రా ఎవ‌రైనా? జీరో సైజ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వెలిగిపోయిన ఈ దేవ‌త‌, అటుపై సైఫ్‌ఖాన్‌ని పెళ్లాడి తైమూర్‌కి జ‌న్మ‌నిచ్చింది. ప్రస్తుతం తైమూర్ ఎదుగుతున్నాడు. ఆ క్ర‌మంలోనే మ‌ళ్లీ త‌న పాత రూపానికి మారిపోయి ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు ర్యాంపును అల్లాడిస్తోంది.

లేటెస్టుగా దోహాలో విక్ర‌మ్ ఫ‌డ్నిస్ బ్రైడ‌ల్‌ డిజైన‌ర్ షోలో ర్యాంప్ వాక్ చేసి మ‌తి చెడ‌గొట్టిందిలా. అచ్చం కొత్త‌ పెళ్లి కూతురులా త‌ళ‌త‌ళ‌లాడింది. ఇంత‌టి అందం కాపాడుకోవ‌డం ఎలా సాధ్యం? అని ప్ర‌శ్నిస్తేబెబో ఆస‌క్తిక‌ర‌మైన జ‌వాబు చెప్పింది.“ 27 వ‌య‌సులో ఓ సినిమా కోసం సైజ్ జీరో ట్రై చేశాను. ఆ త‌ర్వాత ఆ అందాన్ని అలానే కాపాడుకున్నా“ అని చెప్పింది. స్వ‌త‌హాగా పంజాబీ గాళ్స్ బాగా తింటారు. అర‌డ‌జ‌ను ప‌రోటాలు బ‌ట్ట‌ర్‌తో లాగించేస్తాను. కానీ అందం కోసం అవ‌న్నీ క‌ట్టిపెట్టాను.. అని చెప్పింది. ఇప్పుడు ఓ బిడ్డ త‌ల్లి అయ్యాక కూడా సేమ్ మెయింటెయిన్ చేస్తోంది బెబో.