డేరా బాబా అలాంటి వారు కాదు.. దత్త పుత్రిక కామెంట్స్

Tuesday, September 26th, 2017, 12:38:21 PM IST


దేశంలో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన డేరా బాబా కేసు రోజుకో మలుపు తీరుగుతోంది. ఎవరు ఊహించని విధంగా డేరా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పైకి భక్తి పేరుతో జనాల్ని మోసం చేసి వందల కోట్లను సంపాదించాడు. ప్రతి క్షణాన్ని తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని మహిళలపై అత్యచారాలు, హత్యలు చేశాడు. కానీ ఫైనల్ గా ఆ విషయాలు బయటపడుతుండడంతో అందరు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇక దత్త పుత్రికతో కూడా ఆయన చేయకూడని పనులు చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే డేరా అరెస్ట్ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె రీసెంట్ గా బెయిల్ పిటిషన్ కోసం లాయర్ ను కలిసింది. అంతే కాకుండా ఒక స్టేట్ మెంట్ ను కూడా విడుదల చేసింది హనీప్రీత్. గుర్మీత్ రాం రహీం సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. అంతే కాకుండా అనవసరంగా తమపై లేని పోనీ నిందలు మోపుతున్నారని ఆయన నాకు తండ్రి లాంటివారని చెప్పింది. అంతే కాకుండా తనకు ప్రాణ హాని ఉందని పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియాలు వెంటాడుతున్నాయని తెలుపగా పోలీసులు హనీ ప్రీత్ కోసం గాలింపు చర్యలు చెప్పట్టారు. హానిప్రీత్ కి దగ్గరివారిని విచారణను కూడా చేస్తూ.. బెయిల్ పిటిషన్ కోసం లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిసి టివి ఫుటేజ్ ల ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments