త్వరలో నెగటివ్ వస్తుందని ఆశిస్తున్నా – ఎన్టీఆర్

Friday, May 14th, 2021, 08:42:42 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల కరోనా వైరస్ భారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలని తన అభిమానులు, సన్నిహితులు అందరూ కూడా ఆకాంక్షించారు. అయితే వారి శుభాకాంక్షలు మరియు ప్రార్దనలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తను కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో కరోనా వైరస్ నెగటివ్ వస్తుందని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు అయితే అందరూ కూడా సురక్షితంగా జాగ్రత్తగా ఉండండి అంటూ తారక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ భారిన పడిన ఎన్టీఆర్ కి అభిమానులు మరియు సినీ ప్రముఖుల, సన్నిహితులు అంతా కూడా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే తారక్ చేసిన ఒక్క ట్వీట్ తో ఇప్పుడు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.