అర్జున్ రెడ్డి తో అద్భుత హర్రర్!

Wednesday, January 10th, 2018, 11:02:03 AM IST

అర్జున్ రెడ్డి చిత్రం తో విజయ్ దేవరకొండ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు, కొన్ని వర్గాలనుండి ఈ చిత్రం విమర్శలు ఎదుర్కున్నా చివరకు మంచి కలెక్షన్స్ తో పెద్ద విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలు ఆయన చేతిలో వున్నాయి. వీటిలో మూడు చిత్రాలు సెట్స్ పై ఉండగా, మిగిలిన మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే వీటిలో ముందుగా ఏది విడుదల అవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాయలేదు. అయితే ఇదివరకు ‘ది ఎండ్’ అనే ఒక చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ తో తెరకెక్కించే ఒక హర్రర్ తన తదుపరి చిత్రం అంటున్నారు. రాహుల్ ది ఎండ్ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు, అయితే అతని టేకింగ్ ని మెచ్చిన విజయ్ ఆయనకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన థ్రిల్లర్ అని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నిర్మాతలు అంటున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం వుంది….