ట్రైల‌ర్‌ : రోబోగాళ్ డిష్యుం డిష్యుం

Thursday, July 26th, 2018, 01:18:20 PM IST

ఒక రోబో అంద‌మైన అమ్మాయిగా మారితే.. అటుపై డిష్యుం డిష్యుం చేస్తూ అద‌ర‌గొడితే .. ఆ దృశ్యం వీక్షించేవారికి ఎలా ఉంటుంది? ఎలాంటి అనుభూతి క‌లుగుతుంది? ఇదిగో అలాంటి అనుభూతిని ఆస్వాధించాలంటే ఈ ట్రైల‌ర్ వీక్షించాల్సిందే.

ప్రాణం పోసుకున్న రోబోటిక్ లేడీ అరివీర విన్యాసాల్ని ఆవిష్క‌రిస్తూ తాజాగా రిలీజైన అలిటా- బ్యాటిల్ ఏంజెల్ ట్రైల‌ర్ దుమ్ము దులిపేస్తోంది. రోబ‌ర్ట్ రోడ్రిగ్‌తో క‌లిసి అవ‌తార్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. భ‌విష్య‌త్ లేడీ రోబోట్ ఇలా ఉంటుంది అంటూ తాజాగా ట్రైల‌ర్‌ని వ‌దిలారు. అలిటా పోరాట విన్యాసాలు మ‌తి చెడ‌గొడుతున్నాయి. యుకిటో కిషిరో గ్రాఫిక్ న‌వ‌ల `గున్‌మ్` ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. 21 డిసెంబ‌ర్ మూవీ రిలీజ్ కానుంది. అలిటా పాత్ర‌లో రోసా సాల‌జార్ న‌టించారు. `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌: రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్‌` రైట‌ర్ లింకిన్ పార్క్ ఈ పాత్ర‌ను సృష్టించార‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments