పున‌ర్జ‌న్మ‌ల బ్యాక్‌డ్రాప్‌లో ‘హౌస్‌ఫుల్ – 4’

Friday, October 27th, 2017, 10:33:34 AM IST

హౌస్‌ఫుల్ సిరీస్ బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ సిరీస్ అన్న సంగ‌తి తెలిసిందే. సాజిద్ న‌డియావాలా, సాజిద్ ఖాన్ సంయుక్తంగా ఈ సిరీస్‌ని ముందుకు న‌డిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో రెండు సినిమాల‌కు సాజిద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పార్ట్ -3కి సాజిద్ – ఫ‌ర్హ‌ద్ జోడీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఇక ఈ సిరీస్‌లో పార్ట్ -4ని తాజాగా ప్ర‌క‌టిచారు. సాజిద్‌ఖాన్‌ `హౌస్‌ఫుల్ 4` త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని ప్ర‌క‌టించారు. 2018 దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు.

ఇక పార్ట్ -4 క‌థాంశం మునుప‌టి సినిమాల‌తో పోలిస్తే వైవిధ్యంగా ఉంటుంద‌ని సాజిద్ ఖాన్ తెలిపారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో హౌస్‌ఫుల్ -4 చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నామ‌ని తెలిపారు. `హౌస్‌ఫుల్ 3`లో అక్ష‌య్ కుమార్‌, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌, రితేష్ దేశ్‌ముఖ్ లాంటి టాప్ కాస్టింగ్ న‌టించారు. నాలుగో భాగంలో న‌ర్గీస్ ఫ‌క్రీ, లిసా హెడెన్‌ల‌ను నాయిక‌లుగా న‌టించ‌నున్నారు. క‌థానాయ‌కుల వివ‌రాల్ని త్వర‌లోనే వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది. ఇక పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యం అన‌గానే.. ఈసారి మ‌రింత ఆస‌క్తిక‌ర క‌థాంశంతోనే ముందుకొస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

  •  
  •  
  •  
  •  

Comments