హౌస్‌ఫుల్ 4లో పూజా కామెడీలు!

Sunday, June 10th, 2018, 11:45:32 AM IST

సాజిద్ న‌డియావాలా తెర‌కెక్కించ‌నున్న హౌస్‌ఫుల్ 4 తొంద‌ర్లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అక్ష‌య్‌కుమార్, కృతిస‌నోన్‌, బొమ‌న్ ఇరానీ, రితేష్ దేశ్‌ముఖ్ త‌దితరుల్ని ఇదివ‌ర‌కూ కాస్టింగ్‌గా ప్ర‌క‌టించారు. ఇక తాజాగా ఈ సినిమాకి వేరొక అంద‌మైన క‌థానాయిక యాడైంది. ఈ భామ .. పూజా హెగ్డే. ఈరోజు లుక్ టెస్ట్ చేస్తున్నార‌ని త‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించింది. మొహంజోదారో లాంటి డిజాస్ట‌ర్‌లో న‌టించిన పూజాకి ఇదో కిక్ బ్రేకింగ్ మూవీ కాబోతోంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే క్రేజీ టైమ్స్ అహెడ్ అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. అన్న‌ట్టు ఈ భామ ఇప్ప‌టికిప్పుడు టాలీవుడ్ అగ్ర‌హీరోలంద‌రినీ ఖాతాలో వేసుకుని ఆటాడుకుంటోంది. ఎన్టీఆర్ – అర‌వింద స‌మేత సెట్స్‌పై ఉంది. త‌దుప‌రి మ‌హేష్‌- వంశీ పైడిప‌ల్లి చిత్రంలో న‌టించ‌నుంది. అటుపై ప్ర‌భాస్ – జిల్ రాధాకృష్న క్రేజీ ప్రాజెక్టు క్యూలో ఉంది. వీటికి తోడు ఇప్పుడిలా బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేస్తూ ప‌దేళ్ల పాటు ఖాళీ లేనంత బిజీ అయిపోతోంది. వామ్మో పూజా హెగ్డే..!!