సర్వేలు చెబుతున్న మాట..సిద్ధూ,చిరు ఒక్కటే..!

Thursday, September 22nd, 2016, 01:50:46 AM IST

siddhu
మాజీ క్రికెటర్ సిద్ధూ కొన్నిరోజులక్రితం ఆవాజ్ ఏ పంజాబ్ అంటూ కొత్తరాజకీయ పార్టీని స్థాపించాడు.బిజెపి రాజ్య సభ ఎంపీ పదవికి రాజీనామా చేసిమరీ సిద్ధూ రాజకీయ పార్టీని స్థాపించడం విశేషం.సిద్దు కొత్తగా పార్టీని స్థాపించడం తో పంజాబ్ లోని అధికార విపక్షాలకు నిద్రలేకుండా పోయింది.

కానీ సర్వేలు మాత్రం సిద్దు స్థాపించిన పార్టీ మూడోస్థానానికి మాత్రమే పరిమితమవుతుంది అని అంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో 2009 ఎన్నికల సమయం లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అప్పటి అధికార విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేసాడు. కానీ ఎన్నికల్లో మాత్రం మూడో స్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ప్రస్తుతం సిద్ధూ స్థాపించిన ఆవాజ్ ఏ పంజాబ్ పార్టీ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కానుందని అంటున్నారు.