ట్రెండింగ్: ఎంతసక్కగుందో ఈ లచ్చిమి!

Tuesday, February 13th, 2018, 05:43:21 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం మొదటి లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో చిట్టిబాబు గా రామ చరణ్ పలికిన డైలాగులకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల రామ లక్ష్మీగా నటిస్తున్న సమంత ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం ఆడియో విడుదల కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు ఈ చిత్రం లోని ఎంత సక్కగున్నావే అనే గీతాన్ని చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. విడుదలయినప్పటినుండి ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. చిత్రం 1980 నాటి నేపధ్యంది కావడంతో దేవి శ్రీ కంపోజ్ చేసిన ఈ పాట కూడా అప్పటి కాలం నాటి పదాలకు, పల్లెటూరి యాసకు అద్దంపట్టినట్లుంది. ముఖ్యంగా గీత రచయిత చంద్రబోస్ ఎంత సక్కగున్నావే లచ్చిమి అంటూ ఆమె అందాన్ని వర్ణించిన తీరుకు నెటిజన్లు మంచి మార్కులువేస్తున్నారు . పాట పల్లవి గా వచ్చే ‘ఏరుసెనగకోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి’ ‘సింత సెట్టుఎక్కి చిగురుకొయ్యబొతే సేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నావే’ అంటూ చేసిన పద ప్రయోగం, దేవిశ్రీ సంగీతం అందించిన ఈ మెలోడియస్ గీతం ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది….