బిగ్ బ్రేకింగ్ : ఈ ఒక్క విషయాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.!

Sunday, June 2nd, 2019, 05:04:55 PM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అయ్యారు అనే ఆనందం ఒక పక్క వైసీపీ శ్రేణుల్లో కనబడుతున్నా మరో పక్క మాత్రం రాబోయే రోజుల్లో జగన్ ముందున్న పెను సవాళ్ళను అస్సలు ఎలా ఎదుర్కుంటారా అన్న అంశం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.ఇప్పటికే జగన్ పెట్టిన “నవరత్నాలు” అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి గట్టిగానే వెళ్లినా వాటన్నిటిని ఎలా ఆచరణలోకి తీసుకువస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ ముందు మరో గట్టి సవాలు ఉంది.ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలుసు.

దానికి తోడు నిండా అప్పులు కూడా ఉన్నాయి.దీనితో జగన్ ఈ ఒక్క 100 కోట్లతోనే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి బాట పట్టిస్తారో అన్నది చాలా కీలకమైన అంశంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇచ్చేది.జగన్ చెప్తున్నా హామీలు ఎలా నెరవేర్చేది? ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల మందికి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి నెలకు 5000 ఇచ్చి పోషించేది కేవలం ఈ ఒక్క 100 కోట్లతో ఇదంతా సాధ్యమయ్యే పనులేనా అంటూ రకరకాల ప్రశ్నలు ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నాయి.ఇప్పుడు జగన్ పరిస్థితి మాత్రం కత్తి మీద సాము వంటిదే అని చెప్పాలి.మరి ఈ ఒక్క విషయాన్ని జగన్ రానున్న రోజుల్లో అసలు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.