క‌ళ్యాణ్‌రామ్‌కి క‌న్నుగీటిన ఫేస్‌బుక్‌ యాంక‌ర్‌?

Wednesday, March 21st, 2018, 09:02:38 PM IST


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన `ఎంఎల్ఏ` మార్చి 23న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి కిర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌టాస్ త‌ర‌హా కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇద‌ని, ఆ స్థాయిలో విజ‌యం సాధిస్తాన‌ని క‌ళ్యాణ్ రామ్ తెలిపారు. రిలీజ్‌కి ఇంకో రెండ్రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ఆ క్ర‌మంలోనే క‌ళ్యాణ్‌రామ్ హైద‌రాబాద్‌లోని ఫేస్‌బుక్ కార్పొరెట్ కార్యాల‌యానికి వెళ్లి డైరెక్టుగా లైవ్‌లో ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంట‌ర్వ్యూ ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. న‌టుడిగా, నిర్మాత‌గా త‌న ఫ్యాష‌న్‌, స్టీరియోస్కోపిక్ 3డి టెక్నాల‌జీలో ఓం 3డి తీయాల‌నుకోవ‌డానికి కార‌ణం స‌హా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌పై యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చాడు. అంతేకాదు త‌న‌కు హీరోయిన్‌గా ఛాన్సిస్తారా? అని అడిగిన యాంక‌ర్‌కు త‌ప్ప‌కుండా.. తెలుగు మాట్లాడ‌డం వ‌స్తే చాల‌ని అన్నారు క‌ల్యాణ్‌రామ్‌. ఫేస్‌బుక్ ఆఫీస్‌లో తొలిసారి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం త‌న‌కు నెర్వ‌స్ గా ఫీల‌వుతున్నాన‌ని క‌ళ్యాణ్‌రామ్ అన్నారు. వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ లా క‌న్ను గీటాల్సిందిగా క‌ళ్యాణ్‌రామ్‌ని స‌ద‌రు యాంక‌ర్ ఆట‌ప‌ట్టించింది. క‌ళ్యాణ్ రామ్ కాస్త మొహ‌మాటంగా సిగ్గుప‌డుతూ క‌న్ను గీటినా స‌ద‌రు యాంక‌మ్మ మాత్రం ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా క‌న్ను కొట్టి చూపించడం ఇంట‌ర్వ్యూలో హైలైట్‌.