రవిప్రకాష్ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది…?

Monday, June 10th, 2019, 09:00:19 PM IST

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ నేరారోపణలు కేసులో గత కొంతకాలంగా సహవాసం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే… రవిప్రకాష్ ని ఇప్పటివరకు కూడా పోలీసులు అరెస్టు చేయకుండా ఉన్నప్పటికీ కూడా వాళ పద్దతిలో రకరకాలుగా విచారణలు జరిపినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తేలిపోయింది. కాగా కోర్టు సహకారంతోనే అరెస్టు చేయాలనీ పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ కేసులో కోర్టు తీర్పు చాలా కీలకంగా మారనుంది. ముందుగా ఫోర్జరీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత లోగో అమ్మకం కేసులో మరో రెండు రోజులు ప్రశ్నించగా, వారిని తప్పుదోవ పట్టించేందుకు రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్న సంగతి తెలుసు. కానీ రవిప్రకాష్ చెబుతున్న ప్రకారం కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం తనకు లేదని అంటున్నారు.

కాగా కొన్ని మీడియాలా కథనం ప్రకారం రవిప్రకాష్ అరెస్టు దాదాపుగా ఖాయమని చెప్పేసాయి. కానీ నేరారోపణలు రుజువు కాకుండానే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్న తలెత్తింది. అయితే పోలీసుల విచారంలో రవిప్రకాష్ సహకరించడం లేదని పోలీసులు ఇదివరకే చెప్పారు. అయితే పోలీసులు మాత్రం రవిప్రకాష్ కి సంబంధం లేదని చెప్పడంలో విఫలమయ్యారు. కానీ మరి దోషిగా నిరూపించడానికి పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయో లేవో అని నిరూపించలేకపోతున్నారు. కానీ పోలీసులు ఈ కేసులో కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎలాగైనా రవిప్రకాష్ ని ఆరేటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రవిప్రకాష్ అంటున్నారు.