వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంది…?

Tuesday, August 13th, 2019, 12:48:09 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు… అయితే ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలకు గాని 151 స్థానాలను కైవసం చేసుకొని మరీ ఏపీలో అధికారంన్ని దక్కించుకుంది వైసీపీ పార్టీ. అంటే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీమీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రభంజనాన్ని సృష్టించాడు కాబట్టి ఏపీలోని మిగతా పార్టీలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పటికే రాజకీయ వేత్తలు చాలాసార్లు ప్రస్తావించారు కూడా. ఒకవేళ ఆలా ఉండకుండా మళ్ళీ రెచ్చిపోతే ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఎక్కువవుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఏపీలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ కూడా అధికార ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇస్తామని, కాగా పాలపరమైన ఇబ్బందులేమైనా తలెత్తితే అపుడు విమర్శలు చేస్తామని అధికారికంగానే ప్రకటించారు.

కానీ ఆ మాటలకూ ఎవరు కూడా కట్టుబడి లేరని చూస్తేనే అర్థమవుతుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ మాత్రం, అధికార పార్టీ పైన ఎప్పుడో విమర్శలు ప్రారంభించింది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా ముఖంగా ముఖ్యమంత్రి జగన్ ని విమర్చించడమే ఒక పనిగా పెట్టుకున్నారని అర్థమవుతుంది. ఇకపోతే టీడీపీ నేత నారాలోకేష్ కూడా ప్రతిసారి ట్విట్టర్ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వీరు చేరిన తప్పులే మళ్ళీ చేస్తున్నారని చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేయనని చెప్పారు కానీ చివరికి ఆయన కూడా ఇపుడు నెమ్మదిగా విమర్శలు ప్రారంభించారు. ఇకపోతే బీజేపీ పార్టీ. ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాని దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందుకు గాను టీడీపీ నేతలందరినీ కూడా తమ పార్టీలో కలుపుకుపోతున్నారు. అయితే బీజేపీ అనుకున్న ప్రకారం టీడీపీ స్థానాన్ని ఆక్రమిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.