జగన్ మంత్రి వర్గంలో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు…?

Friday, June 7th, 2019, 10:34:24 PM IST

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి సంబందించిన మంత్రివర్గం ఈ నెల 8 న అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు… మొత్తానికి 25 మంది కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంలో బీసీలకు ఎక్కువగా అవకాశం ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది… రెండవ స్థానంలో రెడ్డి కులానికి చెందిన వారు ఉండగా, మూడవ స్తానం కాపు సామజిక వర్గానికి చెందిన వారు దక్కించుకున్నారు. ఆ తరువాత ఎస్సీలకు 4 మంత్రి పదవులు దక్కాయి. కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ,మైనారిటీలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.

బీసీ వర్గానికి చెందిన వారు…

ధర్మాన కృష్ణదాస్
బొత్స సత్యనారాయణ
పిల్లి సుభాష్ చంద్రబోస్
మోపిదేవి వెంకటరమణ
అనిల్ కుమార్ యాదవ్శంకర్ నారాయణ
గుమ్మన జయరాం

రెడ్డి వర్గానికి చెందిన వారు…

ఆళ్ల రామకృష్ణారెడ్డి
బాలినేని శ్రీనివాసరెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మేకపాటి గౌతంరెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

కాపు సామాజిక వర్గానికి చెందిన వారు…

కురసాల కన్నబాబు
అవంతి శ్రీనివాస్
ఆళ్ల నాని
పేర్ని నాని

ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు…

కొడాలి నాని (కమ్మ)
వెల్లంపల్లి శ్రీనివాస్ (ఆర్య వైశ్య)
చెరుకువాడ శ్రీరంగనాథరాజు (క్షత్రియ)
అంజద్ బాషా (మైనారిటీ)
పుష్ప శ్రీవాణి (ఎస్టీ)