ర‌కుల్ గ్లామ్‌&గ్లిజ్‌ వెన‌క అత‌డెవ‌రు?

Sunday, March 25th, 2018, 03:45:14 PM IST

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ స‌హా సౌత్ – నార్త్ లోనూ అంద‌రికీ సుప‌రిచిత‌మైన క‌థానాయిక‌. అయితే ప్ర‌భాస్ సోద‌రుడు సిద్ధార్థ్ రాజు న‌టించిన సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్‌లో న‌టించి, అటుపై వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ విజ‌యం సాధించే వ‌ర‌కూ త‌నో అనామ‌క న‌టి. అయితే అటుపై అంచెలంచెలుగా కేవ‌లం ఐదేళ్ల‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు త‌న‌కంటూ ఓ స్టాట‌స్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో త‌న లుక్‌ని పూర్తిగా మార్చేసింది. ఈ అనూహ్య‌మైన మార్పు వెనక ఎవ‌రున్నారు? ఉన్న‌ట్టుండి అంత‌కంత‌కు స్లిమ్ లుక్లోకి మారిపోయి షాకిస్తున్న ర‌కుల్ వెన‌క అస‌లెవ‌రున్నారు? అంటూ యూత్ ఒక‌టే చ‌ర్చించుకుంటోంది.

ర‌కుల్ ఇటీవ‌ల చాలా స్వ‌ల్ప వ్య‌వ‌థిలో 9 కిలోల బ‌రువు త‌గ్గింది. ఇంత త‌క్కువ టైమ్‌లో అంత మార్పు ఎలా సాధ్యం? అంటే త‌న‌కో స్పెష‌ల్ ప‌ర్స‌న‌ల్ ట్రైన‌ర్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఖునాల్ గిర్ అనే బాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ ఈ అమ్మ‌డికి చాలాకాలంగా శిక్ష‌ణ‌నిస్తున్నారు.కేవ‌లం 45 రోజుల వ్య‌వ‌థిలో 9 కేజీల బ‌రువు త‌గ్గించ‌డం వెన‌క అత‌డి కృషి అభినందించ‌ద‌గిన‌ద‌ని చెబుతున్నారు. ఇక జిమ్ బిజినెస్‌లోనూ ర‌కుల్ స్పీడ్గానే ఉన్న సంగ‌తి తెలిసిందే.