చీర‌క‌ట్టు.. చూడు పిన్న‌మ్మోవ్!

Sunday, June 3rd, 2018, 09:43:16 PM IST

భార‌త‌దేశంలో మ‌గువ‌ల‌కు చీర క‌ట్టుకోవ‌డం తెలుసునా? ఎంతమంది క‌రెక్టుగా క‌ట్టుకోగ‌ల‌రు? స‌మోసాలా చుట్టేయ‌కుండా.. సోగ్గా చీర‌క‌ట్టి బొడ్డులో కుచ్చిళ్లు దోపేది ఎంద‌రు? … అనూహ్యంగా తెర‌పైకి ధ‌ర్మ‌ సందేహ‌మిది. అయితే ఇలాంటి సందేహానికి కార‌ణం ఎవరై ఉంటారు? … ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు క్వీన్ కంగ‌న‌ర‌నౌత్‌.

భార‌తీయ మ‌హిళలు త‌ప్ప‌నిస‌రిగా చీర‌క‌ట్టుకోవ‌డం నేర్చుకోవాలని ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ స‌వ్య‌సాచి ముఖ‌ర్జీ వ్యాఖ్యానించార‌ని కంగ‌న ప్ర‌త్యేకంగా గుర్తు చేసింది. చీర‌క‌ట్టి మ‌నదైన‌ సాంప్ర‌దాయాన్ని అన్నిచోట్లా ఎలివేట్ చేయాల‌ని, ఆ ప‌ని ఇటీవ‌లి మోడ్ర‌న్ గాళ్స్ చేయ‌డం లేద‌ని, అస‌లు మ‌న మ‌హిళలు ఇండివిడ్యువాలిటీని కోల్పోయార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారుట‌. అందుకే కంగ‌న జ‌రీ అంచు చీర క‌ట్టుకుని మ‌రీ ప్రాక్టికల్ గా దేశంలోని మ‌హిళామ‌ణుల్ని అట‌కాయించింది. నిజ‌మే.. కంగ‌న‌లా స‌గ‌టు మ‌హిళ‌లు చీర క‌ట్ట‌నూ లేరు… కుచ్చిళ్లు దోప‌నూ లేరు! ప్చ్‌!!

  •  
  •  
  •  
  •  

Comments