ప‌వ‌న్‌తో వక్కంతం అలా మిస్స‌య్యాడు!

Thursday, May 10th, 2018, 11:19:43 PM IST


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని క‌ల‌గ‌ని మిస్స‌యిన వారి జాబితా అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. ఇదివ‌ర‌కూ మైత్రి మూవీస్‌లో సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వ ంలో ఓ సినిమా తెర‌కెక్కాల్సింది. కానీ ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ పెట్టి, రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో చివ‌రి నిమిషంలో ఛాన్స్ మిస్స‌య్యాడు. ఆ త‌ర‌వాత ప‌లువురు త‌మిళ ద‌ర్శ‌కుల ప్ర‌య‌త్నాలు చేశారు. క‌థ‌లు ఓకే అయినా కానీ వాళ్లు కూడా వెయిట్ చేయాల్సొచ్చింది. ప‌వ‌న్ ఒక్క త్రివిక్ర‌మ్‌కి త‌ప్ప వేరే ఎవ‌రికీ ఛాన్స్ ఇవ్వ‌లేదు.

ఇక‌పోతే గ‌బ్బ‌ర్‌సింగ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన హ‌రీష్ శంక‌ర్, ఆ త‌ర‌వాత మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పార్ట్ 2 తీయాల‌ని ప్ర‌య‌త్నించినా విఫ‌ల‌మ‌య్యాడు. ల‌క్కీగా బాబి ఆ ఛాన్స్ ద‌క్కించుకుని స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ తీశాడు. ఆ సినిమా ఫ‌లితం మాట ఎలా ఉన్నా కానీ ఓ డెబ్యూ ద‌ర్శ‌కుడు వెంట‌నే ప‌వ‌న్ తో అవ‌కాశం అందుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇక‌పోతే ప‌వ‌న్‌ని డైరెక్ట‌ర్ చేయాల‌ని క‌ల‌గ‌న్న వేరొక ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని తాజాగా `నా పేరు సూర్య థాంక్యూ ఇండియా మీట్` తేల్చి చెప్పింది. ఈ వేడుక‌లో వ‌క్క ంతంని ఉద్ధేశించి మాట్లాడిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ టాప్ సీక్రెట్ లీక్ చేశారు. వ‌క్క ంతం ర‌చ‌యిత‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. కొమ‌రం పులి టైమ్‌లోనే క‌థ చెప్పినా సినిమా చేయ‌లేక‌పోయామ‌ని వెల్ల‌డించారు. మొత్తానికి ఇక ప‌వర్‌స్టార్ రాజ‌కీయాల్లోకి పూర్తిగా వెళ్లిపోయాక చాలా పెద్ద క్యూ అలానే ఉండిపోయింద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. డెబ్యూ ద‌ర్శ‌కులు, న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు ఇక ప‌వ‌న్‌తో ఛాన్స్ లేన‌ట్టేనేమో!