జైల్లో గజల్ శ్రీనివాస్ ఎలావున్నారు?

Friday, January 12th, 2018, 03:48:28 PM IST

ఆలయవాణిలో రేడియో జాకీగా ఉద్యోగం చేస్తున్న మహిళ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చెంచల్ గూడ జైలు లో వున్నారు. గజల్ శ్రీనివాస్ తనని లైంగికంగా వేధించారని ఆ మహిళా ఆధారాలతో సహా డిసెంబర్ 29 న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే, దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల ఆయన బెయిలు కు అప్లై చేయగా, బయటకు వస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని కోర్ట్ ఆయనకు బెయిల్ తిరస్కరించింది.

అంతే కాదు గతం లో ఆయనతో కలిసి పనిచేసిన పలు సాంస్కృతిక సంస్థలు ఇప్పుడు ఆయన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకి రావడం తో విస్తుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను స్వఛ్చాంద్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలుకు వచ్చిన తొలి రెండు రోజుల్లో భోజనం చేయని ఆయన తరువాతి రోజు నుండి యధావిధిగా భోజనం తీసుకుంటున్నారట. జైలు లో ని ఇతర ఖైదీలతో కలివిడిగా గడుపుతూ వారికి తన గజల్స్ వినిపిస్తున్నారని, ఇటీవల జైలు లో జరిగిన యోగ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం లో ఆయన గజల్స్ పాడి అక్కడి వారందరిని ఆకట్టుకున్నారని అధికారులు చెప్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments