ప్రేమ‌.. స్నేహం.. జీవితం.. సీక్వెల్ స్టోరీలోనూ!

Thursday, March 8th, 2018, 09:08:38 PM IST

ప్రేమ‌.. స్నేహం.. జీవితం.. ఇవి ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌య్యే పాయింట్స్‌. అందుకే ఇలాంటి ఆద్యంతం ఉత్కంఠ రేపే పాయింట్ తో జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన `జింద‌గి న మిలేగి దొబారా` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో లైఫ్ గురించి ఎంతో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు స‌ద‌రు ద‌ర్శ‌కురాలు. అలాగే హృతిక్‌రోష‌న్ – క‌త్రిన జంట‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, అభ‌య్‌- క‌ల్కి కొచ్లిన్ జంట న‌ట‌న ఎంతో ప‌రిణ‌తితోనూ ఆక‌ట్టుకుంది. కొంద‌రు స్నేహితుల జీవిత ప‌య‌నంలో సాగిన అసాధార‌ణ స‌రిగ‌మ‌లు ఏంట‌నేది ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించ‌డంలో జోయా ప్ర‌తిభ‌కు పేరొచ్చింది. అందుకే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఏడాది చివ‌రిలో స్క్రిప్టును ఫైన‌ల్ చేసి, వ‌చ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న గ‌ల్లీబోయ్స్ పూర్త‌వ్వ‌గానే, త‌దుప‌రి జింద‌గీ సీక్వెల్‌పై జోయా అక్త‌ర్ మ‌న‌సు పెడ‌తారుట‌. అప్ప‌టికి హృతిక్‌, ఫ‌ర్హాన్ త‌దిత‌రులు అందుబాటులోకి వ‌స్తారు.