ఐపీఎల్ లో చిందులు వేయనున్న హృతిక్…

Tuesday, April 3rd, 2018, 12:33:44 PM IST

క్రికెట్ అనగానే ప్రేక్షక అభిమానులకే కాదు, సినీ సెలబ్రిటీస్ కి కూడా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ఆరంభ వేడుకలు ఈ నెల 7న ముంబైలో అట్ట‌హాసంగా జ‌ర‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌, పరిణితీ చోప్రా, వ‌రుణ్ ధావ‌న్‌, జాక్వెలిన్ ఫెర్మాండెజ్‌లు స్టేజ్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నార‌ని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఓ ఫుట్ బాల్ మ్యాచ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ గాయ‌ప‌డ్డాడు. హై-ఎనర్జీ లెవల్స్‌తో ఐపీఎల్ వేడుక‌లో ప్రదర్శన చేస్తే భుజంపై అధిక మొత్తంలో ఒత్తిడి పడుతుందని, అందుకోసం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ర‌ణ్‌వీర్ ఐపీఎల్ ప్రారంభ వేడుక‌కి దూరం అయ్యాడు. అయితే షెడ్యూల్ ప్ర‌కారం గల్లీభాయ్ షూటింగ్‌లో అతడు రెగ్యులర్‌గా పాల్గొంటాడని తెలుస్తుంది. ఎలాంటి స్టంట్స్ లేకుండా ఉన్న టాకీ సీన్లలో పాల్గొంటారట‌. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న సింబాతో పాటు, “83” సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌గా అలరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు ర‌ణ్‌వీర్‌. అయితే భుజం గాయం కార‌ణంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌కి దూర‌మైన ర‌ణ్‌వీర్ ప్లేస్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌ని తీసుకోవాలని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌తో సంప్ర‌దించిన నిర్వాహ‌కులు హృతిక్‌కి భారీ మొత్తం ఇచ్చి ప్రారంభ‌వేడుక‌లో త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాల‌ని కోరార‌ట‌. మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇక హృతిక్ ఏ లెవల్ లో ఆదరగోడతాడో ఈ నెల 7 వరకు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments