సినిమాకోసం హృతిక్ ఎలా మారిపోయాడో చూసారా..!

Saturday, May 19th, 2018, 12:27:43 AM IST

సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వల బాడీ షేప్స్ ఐ ట్రాన్స్ ఫార్మ్ చేసుకుంటూ పాత్రకు పోసే చాలెంజింగ్ రోల్స్ చేసే హీరోలు ఎవరు అంటే వేల్లపైన లెక్కపెట్టి చెప్పవచ్చు. అంట తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో బాలీవుడ్ లో ముందుగా గుర్తుకు వచ్చేది హృతిక్ రోషన్. 2012లో వచ్చిన అగ్నిపత్ సినిమాకోసం సుమారు 30 బరువు పెంచుకొని తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్న హృతిక్ దాని తర్వాత వచ్చిన క్రిష్3, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలకు కావాల్సినట్టుగా మల్లీ యథా స్థానికి మారిపోయాడు.

అయితే ఇప్పుడు హృతిక్ సూపర్ 30 సినిమాలో కూడా హృతిక్ ఇలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు తెలిసింది. ఒక మ్యాథ్స్ టీచర్ గా తెరపైన కనిపించబోతున్న హృతిక్ కథకు అనుగనంగా మళ్ళీ తన శరీరాకృతిని మార్చుకున్నట్టు తెలిసింది. దానికి సంబందించిన ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో హృతిక్ చాలా సన్నగా ఒక యుక్త వయసు కుర్రాడిలా కనిస్తున్నాడు. అనుకున్నట్టుగా అన్ని పనులు సకాలంలో పూర్తయితేఈ సినిమాను వచ్చే జనవరీలో విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నారట.

  •  
  •  
  •  
  •  

Comments