వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ – కేవలం ప్రచారమేనా…?

Tuesday, June 11th, 2019, 09:38:12 PM IST

ప్రస్తుతానికి ఒక జాతీయ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది… ఏపీలో అధికారంలో ఉన్నటువంటిని వైసీపీ పార్టీ కి బీజేపీ పార్టీ ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. కేంద్రంలో కీలకమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి కేటాయించిందని వార్త రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటీవల జరిగినటువంటి లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 22 స్థానాలను సాధించుకొని లోక్ సభలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే కేంద్రంలో అధికారిక పార్టీకి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని గతకొంతకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఈ విషయం మీద పలు చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. కేంద్రంలో ఎన్డీయే కి భాగస్వామ్యమైన జేడీయూ గత కొంత కాలంగా బీజేపీ పార్టీ కి దూరంగానే ఉంటుంది. దీంతో జేడీయూ స్థానాన్ని వైసీపీ తో భర్తీ చేయాలనీ బీజేపీ అనుకుంటున్నదని సమాచారం. కాగా ఈ బీజేపీ ఆఫర్ పై వైసీపీ కూడా ఆలోచిస్తుందని సమాచారం. అయితే వైసీపీ తరపున గెలిచిన ఒక గిరిజన మహిళకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని సమాచారం. కాగా ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.