నల్ల ధనంతో గ్రామాలనే కొనేస్తున్నారు..ఎలాగో తెలుసా..?

Sunday, November 13th, 2016, 04:20:35 PM IST

money
మోడీ దెబ్బకు నల్ల బాబులు విలవిలలాడి పోతున్నారు. ఒక్క సారిగా కట్టలు కట్టలుగా దాచుకున్న నల్ల ధనం ఒక్క మోడీ మాటతో చిత్తూ కాగితాలుగా మారిపోయాయి. కొందరు నల్ల బాబులు కక్కలేక మింగలేక ఉన్నారు.మరికొందరు అతి తెలివి మంతులు మాత్రం తమ నల్ల ధనాన్ని ఇప్పటికిప్పుడు ఎలా రక్షించుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. దీనికోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి అతి తెలివి మంతులు ఆంధ్రప్రదేశ్ లోని విజయ నగరం జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ నగరం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన అవినీతి సొమ్ముని రక్షించుకునే పనిలో భాగంగా ఒక గ్రామాన్నే కొనేసినట్లు తెలుస్తోంది.సదరు వ్యక్తి విజయనగరం జిల్లా లోని ఒక గ్రామ పెద్దకు రూ. 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది.అయన గ్రామంలోని ప్రజలతో వారి పొదుపు బ్యాంకు ఖాతాల్లో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున జమ చేయించినట్లు సమాచారం. రెండు లక్షల వరకు ఆదాయ పన్ను పరిశీలన ఉండదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ నాలుగు నెలల తరువాత ఆ డబ్బుని డ్రా చేసి సదరు డబ్బు గల వ్యక్తికీ రూ.7 కోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చు కున్నట్లు తెలుస్తోంది.మిగిలిన రూ. 3 కోట్లు గ్రామానికి చెందే విధంగా వారి మధ్య ఒప్పందం జరిగిందని సమాచారం. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశమంతటా జారుతున్నాయని తెలుస్తోంది. బ్యాంకుల్లో అధికారులు అంచనాలకు మించి ధనం డిపాజిట్ కావడమే దీనికి నిదర్శనమని అంటున్నారు.