ప్రియా వారియర్ క్రేజ్ క్యాష్ చేసుకుందామనే ?

Thursday, March 8th, 2018, 02:16:18 PM IST

ఈ మధ్య తమ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలా భారీగా ప్రచారం చేసుకుని జనాలకు అమ్మేయాలన్న విషయాలపై పోటీ ఓ రేంజ్ లో ఉంది. ఇక స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లతో ఎంతైనా రేటు పెట్టి ఆ బ్రాండ్స్ కు అంబాసిడర్లు గా నియమిస్తూ తమ కంపెనీ ప్రొడక్ట్స్ పై క్రేజ్ పెంచేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడికి కూడా తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని చాలా అవకాశాలు క్యూ కట్టాయట. కేవలం కొంటెగా కన్నుగీటు సంచలనం రేపిన ఆ భామ ఎవరో కాదు ప్రియా వారియర్. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో కన్ను గీటిన సీన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అంతే .. ఆ అమ్మాయి కన్ను గీటితే పడిపోని వ్యక్తి లేదంటే నమ్మండి. ఆ ఒక్క సీన్ తో ప్రియా వారియర్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె క్రేజ్ ని తమ కంపెనీ ఉత్పత్తులకు వాడుకోవాలని కొన్ని ప్రముఖ కంపెనీలు ఆమెకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. ,మరో వైపు ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు అటు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.