విశాఖ లో కనిపించని కోవిడ్ నిబంధనలు

Sunday, May 16th, 2021, 02:32:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిబంధనలు పలు చోట్ల అమలు కావడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలు ఉదయం పూట మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం నాడు విశాఖ లో కోవిడ్ నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. ఆదివారం కావడంతో రద్దీగా చేపల మార్కెట్లు కనిపించాయి. కోవిడ్ నిబంధనలు పాటించకుండా నే వ్యాపారాలు చేస్తున్నారు.

అంతేకాక పర్యాటక కేంద్రం వరకూ అరకు లోయ లో కోవిడ్ నిబంధనలు పట్టించుకోనీ జనం. కర్ఫ్యూ మినహాయింపు సమయం లో గుంపులు గుంపులుగా జనం ఉండటం, జాగ్రత్తలు పాటించని వ్యాపారుల తో కరోనా సెకండ్ వేవ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.