ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందంటే ఇదేనేమో ?

Thursday, March 8th, 2018, 03:23:48 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధం ఆయిన విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో కబాలి తరువాత అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన ఓ పోస్టర్ విడుదల అయినా విషయం తెలిసిందే. అందులో రజని తో పాటు ఓ వీధి కుక్క కూడా ఉంది. ఈ సినిమాలో రజనీకాంత్ పెంపుడు కుక్క మణి గా నటించిన ఆ కుక్కకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ అంట !! ఏంటి షాక్ అవుతున్నారా .. మీరు వింటున్నది నిజం .. ఎదో సామెత చెప్పినట్టు ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో ? ఈ పోస్టర్ లో ఉన్న కుక్కను కొనేందుకు పలువురు పోటీ పడుతున్నారట. రాజని కాంత్ తో సినిమాలో నటించింది కాబట్టి దానికి అంత డిమాండేమో !! చెన్నై లో రోడ్డుపై దొరికిన కుక్కను తెచ్చి ఆ సినిమాలో నటింప చేసారు. ఇప్పుడు ఆ కుక్కను కొనేందుకు కోట్లు వెచ్చిస్తున్నారట. ఈ కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిన సీమాన్ అనే వ్యక్తి ఓ సందర్బంగా మాట్లాడుతూ చెన్నై రోడ్డుపైన ఈ కుక్క దొరికింది . చాలా కుక్కలను చూసి దీన్ని ఎంపిక చేసాం. షూటింగ్ ఉన్నన్ని రోజులు దర్శకుడు రంజిత్ బాగా చూసుకున్నాడు. ఇప్పుడు చాలా మంది ఈ కుక్కను కొనేందుకు వస్తున్నారు .. వారు రెండు మూడు కోట్లయినా ఇస్తామని అంటున్నారని .. కానీ ఈ కుక్కను అమ్మనని చెబుతున్నాడు. అది విషయం !!