లాక్ డౌన్ కారణంగా ప్రయాణికులతో రద్దీ గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Wednesday, May 12th, 2021, 10:00:26 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు. హైదరాబాద్ నగరం లో ఉంటున్న వారు తమ సొంత ఊళ్లకు పయనం అయ్యారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తో కిక్కిరిసి పోతుంది. మరొక పక్క హైదరాబాద్ మెట్రో రైలు సేవలు సైతం కుదించడం జరిగింది. ఉదయం 7 గంటల నుండి 8:45 గంటల వరకు మాత్రమే సేవలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా వైరస్ ప్రభావం కారణం గా లాక్ డౌన్ మినహాయింపు ఉదయం 6 గంటల నుండి 10 గంటలకు ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం లో పలు కార్యాలయాలు, సేవలు నిలిచి పొనున్నాయి. అయితే లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా పోలీసులు కేసులు సైతం నమోదు చేయనున్నారు.