ఒక సామాన్య రైతు అకౌంట్ లో రోజుకు కోటి జమ అవుతున్నాయి

Saturday, December 31st, 2016, 10:03:27 AM IST

farmar
అతను ఒక మాములు రైతు. కానీ ఆ రైతు బ్యాంకు అకౌంట్ లో ఈ నెల 24 నుండి రోజూ కోటి రూపాయలు జమ అవుతూ.. డ్రా అవుతున్నాయి. కర్నూల్ జిల్లా పెద్దకడబూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఊరిలో అబ్రహం అనే రైతుకు అక్కడి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లో ఈ నెల 24 నుండి రోజూ పెద్దమొత్తంలో డబ్బు జమ అవుతూ.. డ్రా అవుతుంది. ఆ రైతు ఫోన్ నెంబర్ కి రోజూ మెసేజ్ లు వస్తున్నాయి.

దీనితో భయపడిన అబ్రహం తనకు తెలిసిన వ్యక్తి అయిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు కు ఈ విషయాన్నీ చెప్పాడు. దీంతో రాజు ఈ విషయాన్నీ మీడియా కు తెలియజేసాడు. రైతు సెల్ నెంబర్ 9989050379 కు ఇప్పటివరకు 68 మెసేజ్ లు వచ్చాయి. 30 వ తేదీ ఉదయం 11.24 కు 1,96,07926 రూపాయలు జమ అయినట్లు.. మళ్ళీ సాయంత్రం 5.44 గంటలకు 1,33,48781 రూపాయలు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్ లను ఆయన చూపించారు. ఈ నగదు ల్యాన్ కో అమర్ కంటక్ లిమిటెడ్ పేరుతొ అబ్రహం అకౌంట్ లో జమ అవుతుంది. బ్యాంకు అధికారులు సంబంధం లేకుండా ఇలాంటివి జరగడం అసాధ్యం అంటున్నారు. ఈ భారీ మోసం పై వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments