రీ ఎంట్రీ కోసం భారీగా వసూలు చేసిన ఇలియానా ?

Sunday, October 21st, 2018, 11:19:12 AM IST

గోవా భామ ఇలియానా ఎప్పుడైతే బాలీవుడ్ ని నమ్ముకొని తెలుగు సినిమాలు మానేసిందో అప్పటి నుండి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హిందీలో కేవలం రెండు మూడు సినిమాలే చేసింది .. అవికూడా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ తేలేదు. దాంతో సినిమాలు తగ్గడంతో తన క్రేజ్ పెంచుకునే దిషగా హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో పాటు ప్రేమాయణం కూడా సాగిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఎలాగూ చేతిలో సినిమాలు లేవు కాబట్టి క్రేజ్ తగ్గిందని అనుకున్నారు. కానీ తన క్రేజ్ ఎప్పటికి తగ్గదని నిరూపించింది ఈ హాట్ సుందరి .. ఎందుకంటే చాలా రోజుల తరువాత మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తూ రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఇలియానా ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేసిందో తెలుసా .. ఏకంగా రెండు కోట్లు ? ఏంటి షాక్ అవుతున్నారా. అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తే నే చేస్తానని చెప్పడంతో ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తీ చేసిన ఈ అమ్మడు మళ్ళీ బాయ్ ఫ్రెండ్ తో షికార్లు మొదలు పెట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments