రెమ్యూనరేషన్ పెంచేసిన సుకుమార్ ?

Wednesday, May 2nd, 2018, 12:44:32 PM IST

సుకుమార్ .. టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కత్తికి రెండు వైపులా పదునే అని ప్రూవ్ చేసాడు. హాలీవుడ్ మేకింగ్ తో స్టైలిష్ గా సినిమాలు తీయగల దర్శకుడిగా ఎలాంటి పేరు సంపాదించాడో .. 1980 ల నేపథ్యంలో అచ్చమైన పల్లెటూరి కథతో సంచలన విజయాన్ని అందుకుని అదే క్రేజ్ తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం భారీ విజయం అందుకుని నాన్ బాహుబలి రికార్డుల్లో మొదటి స్థానంలో నిలిచింది. టాలీవుడ్ లో 200 కోట్ల గ్రాస్ సంపాదించిన తోలి సినిమాగా విజయం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ కు అవకాశాలు క్యూ కట్టాయి .. ఇప్పటికే ఆయనతో సినిమా చేయడానికి మహేష్ ఓకే చెప్పాడు. దాంతో పాటు అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలు క్యూ లో ఉన్నారు. ఇక రంగస్థలం ఇచ్చిన సక్సెస్ తో దర్శకుడు సుకుమార్ కూడా రెమ్యూనరేషన్ పెంచేసాడని టాక్. అయన నెక్స్ట్ సినిమా మళ్ళీ మైత్రి మూవీస్ బ్యానర్ లోనే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం భారీ రెమ్యూనరేషన్ అడ్వాన్స్ గా తీసుకున్నాడట. మరో వైపు సుకుమార్ నిర్మాతగా కుమారి 21 ఎఫ్ లాంటి భారీ విజయాన్ని అందుకున్నాడు.